Punarnavi Bhupalam : ప్రెగ్నెంట్ వార్తలపై ఘాటుగా స్పందించిన పునర్నవి..

by Disha Web Desk 6 |
Punarnavi Bhupalam : ప్రెగ్నెంట్ వార్తలపై ఘాటుగా స్పందించిన  పునర్నవి..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి పునర్నవి భూపాలం 'ఉయ్యాల జంపాల' సినిమాతో సైడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్‌బాస్ 3లో పార్టిసిపెంట్‌గా వచ్చి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై పలు షోలు, వెడ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కాస్త నటనకు దూరం ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది. అయితే పునర్నవి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది అంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, పునర్నవి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ వార్తలపై ఘాటుగా స్పందించింది. " నా గే బెస్టితో గర్భిణీ అయ్యానంటూ కొంతమంది యూట్యూబ్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. గత నెలలో కూడా నేను కాస్త అనారోగ్యానికి గురైతే.. ఏకంగా ప్రాణాలు పోతున్నాయని రాశారు. ఇదొక చెత్త న్యూస్.. ఇప్పుడేమో నేను గర్భిణీ అని ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారు. నెట్‌లో చూసి ప్రతి వార్తను నమ్మేయకండి.. ఏది నిజమో ఏది అబద్దమో కాస్త తెలుసుకోండి. ఇలాంటి చెత్త రాతలు అవతల మనిషిని చాలా ఇబ్బంది పెడతాయని ఆలోచించండి " అంటూ ఇన్‌స్టా స్టోరి ద్వారా ఫైర్ అయ్యింది.



Next Story

Most Viewed