- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. అప్పుడేనంట?
జబర్దస్త్, బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీ ప్రియాంక సింగ్. ఈ అమ్మడుకు సంబంధించిన పెళ్లి వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్, బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీ ప్రియాంక సింగ్. ఈ అమ్మడుకు సంబంధించిన పెళ్లి వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ప్రియాంక సింగ్ పెళ్లికి సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌లో నా పెళ్లి జ్యువెల్లరీ అనే ఒక వీడియో అప్లోడ్ చేసింది. తన పెళ్లి జరిగిపోయిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ తెలిపింది. నాపెళ్లికి నగలు కొనడానికి షాపింగ్ చేస్తున్నాను అంటూ వీడియో చివరికి వరకు చూడండి, లాస్ట్‌లో నాపెళ్లి ఎప్పుడు అనేది చెబుతాను అని తెలిపింది. చివరకు 2024 ఫిబ్రవరి 30 నా పెళ్లి అందరూ రావాలని ఆహ్వానించింది. అయితే, ఫిబ్రవరి నెలలో 30 ఉండదు కదా అని ఆలోచించారా? అవును.. ఫిబ్రవరి నెలలో 30 ఎలా అయితే ఉండదో,నా జీవితంలో పెళ్లి అనే కాన్సెప్ట్ ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
Also read: పూర్తైన కంగనా చంద్రముఖి 2 షూటింగ్.. కన్నీళ్లు ఆగట్లేదంటూ పోస్ట్..






