- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్‌బాస్ ఆదిరెడ్డి భార్య.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ఆదిరెడ్డి(Adi Reddy) ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ఆదిరెడ్డి(Adi Reddy) ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. కామన్ మ్యాన్ కోటాలో ఈ షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్శించారు. పలు టాస్కుల్లో పాల్గొని టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఆదిరెడ్డి విన్నర్ కాలేకపోయారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చాక ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. అలాగే బిగ్‌బాస్ షోకు రివ్యూలు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా పలు టీవీ షోల్లోనూ భార్యతో పాటు పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక ఇటీవల తన భార్య తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుంచి నిత్యం పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక ఇటీవల సీమంతం వీడియో షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆది రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించాడు. ఆయన భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే వీరికి కూతురు ఉండగా.. మరోసారి ఆడపిల్లనే పుట్టినట్లు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘మళ్ళీ ఆడపిల్ల పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా తల్లి చనిపోయిన మరుసటి రోజే నా కూతురు పుట్టింది. బహుశా దేవుడు అలా ప్లాన్ చేశాడు. నా తల్లి వేరే రూపంలో నా దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది’’ అని రాసుకొచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.






