బిగ్‌బాస్-9: అతను అమ్మాయిల పిచ్చోడు.. నా జోలికి వస్తే తొక్కుతా అంటూ పికిల్స్ పాప సంచలన కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-14 05:56:55  IST  )

బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss Season-9) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలకలలాడుతోంది.

బిగ్‌బాస్-9: అతను అమ్మాయిల పిచ్చోడు.. నా జోలికి వస్తే తొక్కుతా అంటూ పికిల్స్ పాప సంచలన కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss Season-9) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలకలలాడుతోంది. మొత్తం ఇంట్లో 16 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారు మొదటి రోజే ఆట మొదలెట్టారు. పాత కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ పాపులారిటీ, ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఇక వచ్చిరాగానే దివ్వెల మాధురి కళ్యాణ్‌తో గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె కన్నీరు పెట్టుకుని అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. ఇక ఈ విషయంపై పికిల్స్ పాప , దివ్వెల మాధురి చర్చించుకున్నారు. ఈక్రమంలోనే రమ్య మోక్ష (Ramya Moksha)సంచలన వ్యాఖ్యలు చేసింది. సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో భాగంగా..రమ్య మాట్లాడుతూ.. కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు.. అతని ప్రవర్తన వేరేలా ఉంటుంది.

తనూజ(Tanuja)పై చేతులు వేసి తడుమతుంటే నాకే ఏదోలా ఉంది. అదే విధంగా నాతో ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా.. కిందేసి తొక్కేస్తా. ఈ విషయంలో తనూజ ఎందుకు ఊరుకుంటుందో తెలియడం లేదు. కళ్యాణ్‌ను కూడా ఆమె ఆపడం లేదు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు.. వారిద్దరు కాంబినేషన్ ఏంటో అర్థం కాదు అనగా.. దానికి దివ్వెల మాధురి అవును కళ్యాణ్ తన ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయి ఇలా అమ్మాయిలతో చేస్తున్న బిహేవియర్ బాగాలేదు అని అంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది తెలిసి రమ్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

link

READ MORE ......

పిచ్చి ము*డ అంటే బూతు పదం అని నాకు తెలియదు.. రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్

Next Story