- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss-9: కామనర్స్‌కు ఇచ్చిపడేసిన నాగ్.. షో నుంచి వెళ్లిపోతానన్న కంటెస్టెంట్.. ఈ రోజు ఏపిసోడ్‌లో ఏం జరగనుందంటే?
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సక్సెస్ ఫుల్ కొనసాగుతోంది. 8 సీజన్లు పూర్తి చేసుకుని 9వ సీజన్ ఇటీవల ప్రారంభం అయింది.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సక్సెస్ ఫుల్ కొనసాగుతోంది. 8 సీజన్లు పూర్తి చేసుకుని 9వ సీజన్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ షో ఈ సారి సరికొత్తగా ఎంటర్‌టైన్ చేయనుంది. 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి వారం పూర్తైన సంగతి తెలిసిందే. ఇక ఇందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు ఉన్నారు. ఈసారి ఊహకందని మార్పులు, ఊహించని మలుపులతో ఈ షో సాగుతోంది. ఇందులో నామినేషన్స్‌లె మొత్తం 9 సెలబ్రిటీలు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా, విడుదల ప్రోమో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే నాగ్ కంటెస్టెంట్స్‌పై ఫైర్ అయ్యాడు. తన ముందు డబ్బాలు పెట్టుకుని.. కంటెస్టెంట్స్ ఇష్యూకి సంబంధించిన వస్తువులను ఉంచాడు. ఇక ఇందులో ఇమాన్యుయేల్, హరిత హరీష్(Haritha Harish) మధ్య జరిగిన గొడవ గురించి చర్చించారు.
ఇక ఇందులో సెలబ్రిటీ ఇమాన్యుయేల్(Emmanuel) తప్పు లేదని కామనర్ అయిన హరిధ హరీష్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో అతను క్షమాపణలు చెప్పడంతో పాటు ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతానని అంటాడు. దీంతో ప్రోమో అయిపోతుంది. అలాగే ఇందులో మనీష్, శ్రేష్టి వర్మ, ఫుడ్ విషయంలో చేసిన విషయాన్ని కూడా నాగ్ చర్చించారు. అరటి పండ్లు రామ్ రాథోడ్‌కి ఇచ్చి.. శ్రేష్టికి ఇవ్వకపోవడంపై నాగార్జున ఫైర్ అయ్యారు. అలాగే ఇందులో ప్రియా తనే ఇచ్చినట్లు ఒప్పుకొని శ్రేష్టి గురించి మనీష్ గుర్తు చేయలేదని అంటుంది. దీంతో మతి మరుపు టాబ్లెట్స్ వేసుకోమని నాగ్ స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశాడు. ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్‌నుగమనించిన నాగ్.. ఎక్కువగా కామనర్స్‌ను తిట్టారు. చివరగా.. ఎలిమినేషన్స్‌లో ఉన్నవారిని చూపించారు. ఇక ఈ వారం శ్రేష్టి వర్మ హౌస్ నుంచి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది.






