- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: వచ్చిరాగానే తన తడాఖా చూపించిన పికిల్స్ పాప.. నీకు బుర్రలేదంటూ ఆ కంటెస్టెంట్‌ను నామినేట్!
రెండు తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు

దిశ, సినిమా: రెండు తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఓ ముగ్గురు అక్కా చెల్లేళ్లు పచ్చళ్ల బిజినెస్ పెట్టి సెలబ్రిటీలుగా మారారు. ఓ కస్టమర్ పచ్చళ్ల రేట్ ఎక్కువగా ఉందని అన్నందుకు అలేఖ్య బూతులు తిట్టింది. ఇక ఈ వీడియో కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ ముగ్గురు అక్కా చెెల్లెళ్లను ట్రోల్స్ చేస్తూ దారుణంగా తిట్టారు. ఇక ఈ వివాదంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రమ్య మోక్ష. పికిల్స్ సిస్టర్స్‌లో చిన్నమ్మాయి అయిన మోక్ష హాట్ డ్రెస్‌లు ధరించి పలు రీల్స్ చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టించింది. అంతేకాకుండా పలు సినిమాల్లో నటించిన ఆమె సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌ను రాబట్టుకుంది. అంతేకాకుండా తెలుగు రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్నికూడా దక్కించుకుంది.
కానీ మొదటిగా కాకుండా.. వీకెండ్ ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్‌లోకి వెళ్లిన ఆమె మొదటి రోజే తన ఆటను మొదలెట్టింది. నామినేషన్స్‌లో భాగంగా డిమాన్ పవన్‌ను నీకు బుర్రలేదు.. అన్ని విషయాల్లో అలాగే ప్రవర్తిస్తావు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రమ్మకే సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మొదటిరోజే.. తన తడాఖా చూపించిందిగా.. ముందు ముందు ఇంట్లో ఇంకెంత హీట్ పుట్టిస్తుందో చూడాలని అభిప్రాయపడుతున్నారు.






