ప్రియాంక ఓ కుక్క: హౌస్‌లో రచ్చ చేసిన అర్చన

by Dishanational4 |
ప్రియాంక ఓ కుక్క: హౌస్‌లో రచ్చ చేసిన అర్చన
X

దిశ, సినిమా: టెలివిజన్ యాక్ర్టెస్ ప్రియాంక చాహర్ చౌదరితో మోడల్ అర్చనా గౌతమ్‌ తీవ్ర వాగ్వాదానికి దిగింది. పరుష పదజాలంతో విరుచుకుపడుతూ ప్రియాంకను 'కుక్క' అంటూ దారుణంగా ఎద్దేవా చేసింది. విషయానికొస్తే హిందీ 'బిగ్ బాస్ 16' లో ప్రస్తుతం కంటెస్టెంట్లుగా ఉన్న వీరిద్దరికి బ్రేక్ ఫాస్ట్ విషయంలో గొడవ మొదలైంది. తన డ్యూటీ కాకపోయిన కిచెన్‌లోకి వెళ్లిన ప్రియాంక అబ్బు రోజిక్ కోసం పోహ సిద్ధం చేసింది. అది కాస్త స్పైసీగా ఉండటంతో అతను తినలేకపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన అర్చన 'నువ్వు సహాయం చేయాలనుకుంటే ఆ పనిని ఫర్‌ఫెక్ట్‌గా పూర్తి చెయ్యాలి. ఎలాగైనా ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉన్నావ్ కాబట్టి.. కనీసం ఆ పనిపై ఇంట్రెస్ట్ పెట్టు' అంటూ దూకుడుగా వ్యవరించింది. దీంతో 'నీవు కూడా ఇతరుల సహాయం తీసుకుంటావ్. నన్ను కుక్క అంటున్నావు. మన సంభాషణలోకి కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకొచ్చావు' అంటూ అదే రేంజ్‌లో ప్రియాంక రెచ్చిపోవడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవకు దారితీసింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ చర్చనీయాంశమైంది.

READ MORE

సౌత్ ఇండియన్ ఈవెంట్‌లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ



Next Story

Most Viewed