‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. మరో సర్‌ప్రైజ్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-01 06:51:24  IST  )

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’(ManaShankaraVaraPrasadGaru).

‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. మరో సర్‌ప్రైజ్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్..
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’(ManaShankaraVaraPrasadGaru). ఈ సినిమాకు హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్స్‌పై అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో చిరు సరసన నయనతార (Nayanthara)నటిస్తున్నట్లు ఇప్పటికే మూవీమేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక విజయదశమి పండుగకు ఏదైనా అప్డేట్ ఇస్తారని మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రబృందం ప్రేక్షకులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒక రోజు ముందుగానే సెలబ్రేషన్స్ చేసుకోండి అంటూ ట్విట్టర్ ద్వారా అప్డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో నయనతార శశిరేఖ పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అలాగే దసరా సందర్భంగా మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇక విడుదలైన ఫస్ట్ లుక్‌లో నయనతార పసుపురంగు చీరలో, కొప్పున పూలెట్టుకుని, చేతిలో ఓ గొడుగు పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. అక్టోబర్ 2న చిత్రబృందం ఆమెకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నయన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే చిరు అప్డేట్స్ రిలీజ్ చేయాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు.

Next Story