- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కల్ట్’ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. బాత్రూమ్‌లో ఆ పని చేస్తున్న హీరోయిన్ పోస్టర్‌తో షాకిచ్చిన మేకర్స్
కన్నడ బ్యూటీ రచిత రామ్ (Rachita Ram)ఇటీవల ‘కూలీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ రచిత రామ్ (Rachita Ram)ఇటీవల ‘కూలీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రచిత రామ్ వరుస ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా నటిగా ఫుల్ జోష్‌లో ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘కల్ట్’(Cult) ఒకటి. ఇది ‘బ్లడీ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో జైద్ ఖాన్(Zaid Khan) సరసన రచిత రొమాన్స్ చేయనుంది. అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలైకా వాసుపాల్(Malaika Vasupal) ,రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్, లోకీ సినిమాస్ బ్యానర్స్‌పై అనిల్ కుమార్, సంతోష్ శేఖర్, నరసింహా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్స్‌లోకి రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కల్ట్’ నుంచి చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, హీరోయిన్ రచిత రామ్ పుట్టినరోజు కావడంతో ఆమెకు విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో ఆమె లేడీ డాన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విడుదలైన పోస్టర్‌లో... రచిత ఓ పల్చటి డ్రెస్ ధరించి బ్లాక్ షార్ట్‌లో బాత్రూమ్‌లో టాయిలెట్ సీటింగ్‌పై కూర్చొని సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో కనిపించింది.
ఇక ఆమె పక్కన మంటలు చెలరేగి గిటార్ కాలిపోతుండగా.. వెనకాలే ఓ వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో కనిపిస్తుండటం గమనార్హం. ఇక ఇందులో ‘‘నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను’’ అనే కొటేషన్ రాసి ఉండటం ఆసక్తికరంగా మారింది. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయి ఆ తర్వాత ఎలా మారిపోయింది.. ఆమె జీవితం ఏ మలుపులు తిరుగుతుంది.. అనే పాత్రలో రచిత కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.






