‘సంబరాల ఏటిగట్టు’ నుంచి బిగ్ అప్డేట్.. అంచనాలకు మించి ఉంటుందంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(SambaralaYetiGattu ).

‘సంబరాల ఏటిగట్టు’ నుంచి బిగ్ అప్డేట్.. అంచనాలకు మించి ఉంటుందంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(SambaralaYetiGattu ). ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, ‘సంబరాల ఏటిగట్టు’కు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కానుకగా.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘అసుర ఆగమనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. అభిమానుల కోసం ‘సంబరాల ఏటిగట్టు’ టీమ్ స్పెషల్‌గా కుక్ చేయబోతున్నారు. ఈ సారి అది మీ అంచనాలను మించి ఉండబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేసి ఆసక్తిని పెంచారు. కాగా.. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

link

Next Story