బాల‌య్య కొత్త మూవీ స్టోరీ లీక్‌...మాఫియా లీడర్‌గా ఎంట్రీ !

by velandi.Saikiran |   (  Updated:2025-10-14 06:18:06  IST  )

నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వెంకట సతీష్ కిలారు (

బాల‌య్య కొత్త మూవీ స్టోరీ లీక్‌...మాఫియా లీడర్‌గా ఎంట్రీ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వెంకట సతీష్ కిలారు ( Venkata Satish Kilaru) ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈనెల 24న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి అనంతరం సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. వీరి కాంబినేషన్ లో వ‌చ్చిన‌ వీర సింహారెడ్డి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మరో సినిమాను తెరకెక్కించనున్నారు.

NBK111 సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. మాఫియా డాన్ గా, రాజుల కాలం నాటి యోధుడుగా రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తోనే కొనసాగుతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగు వెర్షన్ మినహా స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెలువడనుంది.

READ MORE ......

ఆ స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న అట్లీ.. కాంబో సూపర్ అంటున్న నెటిజన్లు

కొంప‌ముంచిన‌ ప్రదీప్ రంగనాథ్.. ప్రభాస్ కొత్త సినిమా లీక్ ?

Next Story