- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాంతార: చాప్టర్ 1’ చూడాలనుకునే వారికి బిగ్ షాక్.. ఈ రూల్ పాటించాల్సిందేనా.. రిషబ్ శెట్టి ఏమన్నారంటే?
రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’(Kantara: Chapter 1).

దిశ, సినిమా: రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’(Kantara: Chapter 1). ఈ సినిమా 2022లో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రాబోతుంది. ఇందులో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత ప్రేక్షకుల్లో ఎప్పుడెప్పుడు వస్తుందా? అనే అతృత ఎక్కువై పోయింది. ఈక్రమంలోనే.. రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ చూడాలనుకునేవారికి ఓ రూల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
మద్యం సేవించకూడదు, మాంసం తినకూడదు. సిగరెట్ తాగకూడదు. కాంతార చూడాలనుకునే వారు వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి అని అందులో రాసి ఉండటం గమనార్హం. దీంతో అది చూసిన వారంతా షాక్ అవుతూ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో భాగంగా అసలు విషయాన్ని రివీల్ చేశాడు. ‘‘ఒకరి అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. అది ఎవరి ఇష్టం వాళ్లది. ఏది తినాలి.. తినకూడదు అనే విషయాన్ని వారు నిర్ణయించుకునే హక్కు వారికే ఉంటుంది. కొందరు ఫేక్ పోస్ట్ సృష్టించిన విషయం మా దృష్టికి వచ్చింది.
దీంతో అది చూడగానే నేను షాకయ్యాను. వెంటనే దాన్ని నిర్మాతల గ్రూపుకు పంపాను. వారు ఆ పోస్ట్ చూశాక వెంటనే స్పందించలేకపోయారు. సినిమా పేరు ట్రెండింగ్‌లో ఉండటంతో పాపులారిటీకోసం, వ్యూస్ కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని అన్నారు. వెంటనే అతన్ని సంప్రదించారు. దీంతో పోస్ట్ పెట్టిన వ్యక్తి క్షమాపణలు చెప్పడంతో పాటు దాన్ని డిలీట్ కూడా చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో ఫేక్ వార్తలకు చెక్ పడినట్లు అయింది.






