రణ్‌వీర్ సింగ్‌కు బిగ్ షాక్.. ఆరు దేశాల్లో ‘ధురంధర్’ సినిమా బ్యాన్.. కారణం ఏంటంటే!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-12 09:28:07  IST  )

చాలా రోజుల తర్వాత రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రణ్‌వీర్ సింగ్‌కు బిగ్ షాక్.. ఆరు దేశాల్లో ‘ధురంధర్’ సినిమా బ్యాన్.. కారణం ఏంటంటే!
X

దిశ, సినిమా: చాలా రోజుల తర్వాత రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మాధవన్(Madhavan), అక్షయ్ ఖన్నా, సారా అర్జున కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.అయినప్పటికీ ‘ధురంధర్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

వారంలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు రూ. 180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను ఆరు గల్ఫ్ దేశాల్లో ప్రదర్శనను నిలిపివేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, అరేబియాతో పాటు యూఏఈలోనూ ‘ధురంధర్’ చిత్రాన్ని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.

అన్ని చోట్ల విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ.. అసలు అనుమతులు కూడా లభించకపోవడంతో కొన్ని థియేటర్స్‌కి మాత్రమే పరిమితం చేశారు. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయడానికి కారాణం పాకిస్థాన్‌ను వ్యతిరేకంగా తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు విడుదలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్తలు చూసిన వారు కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం ఆరు దేశాల్లో బ్యాన్ చేసినా రణ్‌వీర్ బాక్సాఫీసును షేక్ చేస్తాడని అంటున్నారు.

READ MORE .....

ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించా.. జనాలు మారాల్సిన సమయం వచ్చిందంటూ మాధవన్ ఫైర్

Next Story