ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించా.. జనాలు మారాల్సిన సమయం వచ్చిందంటూ మాధవన్ ఫైర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-12 09:25:52  IST  )

మాధవన్(Madhavan), రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ధురంధర్’(Dhurandhar).

ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించా.. జనాలు మారాల్సిన సమయం వచ్చిందంటూ మాధవన్ ఫైర్
X

దిశ, సినిమా: మాధవన్(Madhavan), రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ధురంధర్’(Dhurandhar). ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రూ.200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమవుతోంది. ప్రేక్షకుల ఆదరణ పొందుతుండటంతో పాటు సినీ సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రివ్యూవర్స్ మిక్స్‌డ్ టాన్‌ను అందిస్తున్నారు. అలాగే పలువురు ‘ధురంధర్’లోని పలు సీన్స్‌పై విమర్శలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఆరు దేశాల్లో బ్యాన్ కూడా చేసిన సంగతి తెలిసిందే. నెగిటివ్ రివ్యూల్ ఇస్తూ కావాలనే పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

తాజాగా, ఈ విషయంపై హీరో మాధవన్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంపై ప్రభావం చూపించే సినిమాలు ఇలా జరగడం సహాజమని.. మొదట్లో చెత్తగా ఉందని రేటింగ్ ఇస్తారని అన్నారు. అలాగే రంగ్ దే బసంతి, త్రీ ఇడియట్స్ చిత్రాలకు కూడా ఇలాగే చేశారని గుర్తు చేసుకున్నారు. కానీ అప్పుడు ఆ సినిమాలకు రేటింగ్ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు కనిపించకూడా పోయారు.. మేము మాత్రం ఇండస్ట్రీలోనూ ఉన్నాం అన్నారు. అలాగే ఈ విషయాలు కోపంతో చెప్పడం లేదని.. ఓ పాయింట్ మిస్ అవుతున్నారని చెబుతున్నా అని చెప్పారు.

జనాలు మారాల్సిన సమయం వచ్చిందని ఫైర్ అయ్యాడు. అలాగే విడుదలైన కొన్ని గంటలకే యూట్యూబర్స్ డిజాస్టర్ అంటూ ముద్రవేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ‘ధురంధర్’ విషయంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాను ముందే ఊహించాం. అందరూ సినిమా చెత్తగా ఉందంటారు. కానీ ఆ తర్వాత అలాంటి చిత్రాలే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తాయని.. తనక పాత రోజులు గుర్తొచ్చాయని ధీమా వ్యక్తం చేశారు. ఒక సినిమా అనేది అది చూపించే ప్రభావంపై ఆధారపడి ఉంటుంది కానీ ఆన్‌లైన్ రివ్యూల మీద కాదని మండి పడ్డారు.

Read More..

రణ్‌వీర్ సింగ్‌కు బిగ్ షాక్.. ఆరు దేశాల్లో ‘ధురంధర్’ సినిమా బ్యాన్.. కారణం ఏంటంటే!

Next Story