ప్రభాస్ అభిమానులకు బిగ్ షాక్.. మరోసారి వాయిదా పడిన ‘ది రాజా సాబ్’ సినిమా..!

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ప్రభాస్ అభిమానులకు బిగ్ షాక్.. మరోసారి వాయిదా పడిన ‘ది రాజా సాబ్’ సినిమా..!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తన బ్లాక్ బస్టర్ చిత్రాలకు సీక్వెల్ చేసే పనిలో పడిన డార్లింగ్ తీరిక లేకుండా వరుస షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ (The Rajasaab)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ ప్రభాస్ తాతగా కనిపిస్తుండగా.. యోగిబాబు, అనుపమ్ ఖేర్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేస్తామని మూవీ మూవీ మేకర్స్ ప్రకటించినప్పటికీ పలు కారణాల చేత వాయిదా పడింది. ఇక మళ్లీ ‘ది రాజాసాబ్’ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్లు పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘ధురందర’ మూవీ కూడా అదే తేదీన విడుదల కాబోతుండటం గమనార్హం.

రెండు భారీ ప్రాజెక్ట్స్ ఓకే రోజు రిలీజ్ అయితే నష్టాలు వస్తాయని భావించిన మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ‘ది రాజాసాబ్’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతున్నట్లు పలు వార్తలు వస్తు్న్నాయి. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇది చూసిన ప్రభాస్ ఫ్యా్న్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. అసలు ఈ సినిమాను రిలీజ్ చేస్తారా? లేక వాయిదాలు వేస్తారా అని మండిపడుతున్నారు.

link

Next Story