- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులకు బిగ్ షాక్.. విజయ్ సేతుపతి ‘సార్ మేడమ్’ సినిమా విడుదల వాయిదా!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నేషనల్ అవార్డు విన్నర్ నిత్యా మీనన్(Nithya Menon) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తలైవాన్ తలైవి’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నేషనల్ అవార్డు విన్నర్ నిత్యా మీనన్(Nithya Menon) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తలైవాన్ తలైవి’. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘సార్ మేడమ్’ (Sir, Madam)పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అప్డేట్స్ విడుదలవగా..ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ మూవీ జులై 25న రెండు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా.. కేవలం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పలు కారణాల వల్ల తెలుగులో వాయిదా పడింది. చివరి నిమిషంలో ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ‘సార్ మేడమ్’ ఆగస్టు 1న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న మక్కల్ సెల్వన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.






