సినీ ప్రియులకు భారీ శుభవార్త.. అక్టోబర్‌లో బాక్సాఫీసు వద్ద రఫ్ఫాడించే సినిమాలు ఇవే!

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-06 04:49:18  IST  )

ప్రతి నెల థియేటర్స్‌లోకి కొత్త సినిమాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి.

సినీ ప్రియులకు భారీ శుభవార్త.. అక్టోబర్‌లో బాక్సాఫీసు వద్ద రఫ్ఫాడించే సినిమాలు ఇవే!
X

దిశ, సినిమా: ప్రతి నెల థియేటర్స్‌లోకి కొత్త సినిమాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల అవుతూ.. బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక గత నెల వచ్చిన సినిమాలు అంతగా మెప్పించలేకపోయినప్పటికీ.. సెప్టెంబర్ 25న విడుదలైనా ‘ఓజీ’ సంచలనం సృష్టించింది. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక అక్టోబర్ నెల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే దసరా, దీపావళి పండుగలు ఉండటంతో చాలా చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ నెల మొత్తంలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అక్టోబర్ నెలలో అలరించబోయే సినిమాలు ఇవే..

అరి: మై నేమ్ ఈజ్ నో బడీ: సాయి కుమార్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరి’ . జయశంకర్ దర్శకత్వంలో రాబోతుండగా.. షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 10న థియేటర్స్‌లోకి రాబోతుంది.

కానిస్టేబుల్: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh), ఆర్యన్ సుభాన్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్‌గా నటించింది. జాగృతి మూవీ బ్యానర్‌పై జగదీష్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శశివదనే: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా కనిపించబోతున్న ఈ సినిమా లవ్ స్టోరీతో రాబోతుంది. సాయి మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్వీఎస్ కన్‌స్టక్షన్స్ ప్రై.లీ, ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్స్‌పై అహితేజ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 10న విడుదల కానుంది.

మారియో: యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌ చిత్రంగా రాబోతుండగా.. ఇందులో హెబ్బా పటేల్, అనిరుధ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.కళ్యాణ్ జీ గోగణ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది.

మిత్రమండలి: బలగం, కోర్టు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తన పాపులారిటీ పెంచుకున్న ప్రియదర్శి ‘మిత్రమండలి’ సినిమాతో ప్రేక్షకు ముందుకు రాబోతున్నాడు. విజయేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నిహారిక ఎన్ఎం హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్స్‌లోకి రాబోతుంది.

వృషభ: కోలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నంద కిషోర్ తెరకెక్కించారు. ఫాంటసీ యాక్షన్ డ్రామా చిత్రం అక్టోబర్ 16న రాబోతుంది.

డ్యూడ్: ‘డ్రాగన్’ హిట్ అందుకుని ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు మరోసారి జత కట్టబోతున్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రాన్ని కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలోకి రాబోతుంది.

తెలుసు కదా: డిజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న శృంగార నాటక చిత్రం. నీరజ కోన తెరకెక్కిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్, కూచిబొట్ల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 17న దీపావళి కానుకగా రాబోతుంది.

బైసన్: చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘బైసన్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. అక్టోబర్ 17న విడుదల కాబోతుంది.

కె-ర్యాంప్: కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 11వ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అక్టోబర్ 18న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

థామా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న ఈ మూవీ హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖి, పరేష్ రావల్, ఫైసల్ మాలిక్, గీత అగర్వాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిందీ భాషా చిత్రం అక్టోబర్ 21న రాబోతుంది.

మాస్ జాతర: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబోలో రాబోతున్న సెకండ్ ప్రాజెక్ట్. భాను భోగ వరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఆర్యన్: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రవీణ్ దర్శకత్వంలో రాబోతుంది.శ్రీనాథ్ , వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. విష్ణు విశాల్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story