బాలయ్య అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. ‘అఖండ-2’ త్రిబుల్ ట్రీట్ ఇవ్వబోతుందంటూ డైరెక్టర్ ప్రకటన

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-16 08:30:21  IST  )

బాలయ్య అభిమానులకు పండుగలాంటి వార్తను బోయపాటి శ్రీను(Boyapati Srinu) చెప్పారు.

బాలయ్య అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. ‘అఖండ-2’ త్రిబుల్ ట్రీట్ ఇవ్వబోతుందంటూ డైరెక్టర్ ప్రకటన
X

దిశ, సినిమా: బాలయ్య అభిమానులకు పండుగలాంటి వార్తను బోయపాటి శ్రీను(Boyapati Srinu) చెప్పారు. ‘అఖండ-2’ సినిమాను 3Dలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇది ఒక గొప్ప అనుభూతి కానుందని తెలిపారు. ‘అఖండ-2’(Akhanda-2) బిగ్ రివీల్ పేరుతో జరిగిన ప్రేస్‌మీట్‌లో డైరెక్టర్ ఆసక్తిర కామెంట్స్ చేశారు. ‘‘బాలకృష్ణ (Balakrishna)అభిమానులు, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను 3Dలో తీసుకొస్తున్నాం. భారతదేశ ఆత్మ, పరమాత్మ, ఈ మూవీ మన దేశ ధర్మం, ధైర్యం ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా రూపొందిస్తున్నాము. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నా.

అందుకే కొన్ని రోజుల క్రితం ప్రచారాన్ని ముంబయి నుంచి ప్రారంభించాం. రామాయణం, మహాభారతం, భగవతగీత. ఇవి మూడూ మా సినిమాలో ఉన్నాయి. ఈ మూడింటికి ఉన్న ఆత్మనే ‘అఖండ-2’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు సంతోష పడుతున్నారు. కాగా.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతుంది. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా.. 14 రీల్స్ ప్లస్ మరియు IVY ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్మించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షల్ మల్హోత్రా, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25 థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story