- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది బెంగాల్ ఫైల్స్’ మూవీ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ ట్వీట్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri) ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు వివాదాస్పదం కావడంతో పాటు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri) ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు వివాదాస్పదం కావడంతో పాటు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇందులో ముఖ్యంగా ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files), ది వ్యాక్సిన్ వార్ వంటి చిత్రాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అగ్నిహోత్రి వరుస సినిమాలు తెరకెక్కిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సంచలనాత్మక డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది బెంగాల్ ఫైల్స్: రైట్ టూ లైఫ్’ (The Bengal Files).
ఈ పాన్ ఇండియా సినిమాను తేజ్ నారాయణ్ అగర్వాల్, బుద్దా ప్రజెంట్స్ బ్యానర్స్‌పై అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal), పల్లవి జోషి నిర్మిస్తున్నారు. అయితే రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన టీజర్ జూన్ 12న మధ్యాహ్నం 12గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన విషయాలను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా ఇందులో ఎవరు నటిస్తారా? అనే ఆసక్తి పెరిగిపోయింది.






