ఎల్ల‌మ్మ ప్రాజెక్ట్ కోసం మ‌రో హీరో..వేణు అదిరిపోయే ప్లాన్ ?

by velandi.Saikiran |

బలగం దర్శకుడు వేణు పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో అందరి మనసులను టచ్

ఎల్ల‌మ్మ ప్రాజెక్ట్ కోసం మ‌రో హీరో..వేణు అదిరిపోయే ప్లాన్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బలగం దర్శకుడు వేణు పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో అందరి మనసులను టచ్ చేశాడు వేణు. తెలంగాణ యాస, భాష ఉట్టిపడేలా బలగం సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయి, దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికీ తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించడంలో వేణు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికే ఎల్లమ్మ పేరుతో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నప్పటికీ, హీరో మాత్రం ఫైనల్ అవ్వడం లేదు.

మొదట నితిన్, నాని పేర్లను అనుకున్నాడట. ఇటీవల కాలంలో శర్వానంద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు సరైన హీరోని పెట్టాలన్నదే వేణు బలమైన కోరిక. సినిమా వచ్చిందంటే బలగం రికార్డులు బద్దలు కొట్టాలన్న కసితో ఎల్లమ్మ తీస్తున్నాడట. అందుకే హీరో విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఎల్లమ్మ సినిమాపై వేణు చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఇప్పటికే దిల్ రాజుకు కూడా వేణు చెప్పినట్లు సమాచారం. దిల్ రాజు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కిష్కింధ పూరి అనే అద్భుతమైన సినిమా తీసి సక్సెస్ అనుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అందుకే సాయి శ్రీనివాస్ వద్దకు వేణు వెళ్లినట్లు చెబుతున్నారు. వీళ్ళ కాంబినేషన్ ఓకే అయితే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story