ప్రపంచ రికార్డ్ సృష్టించిన బెల్లకొండ శ్రీనివాస్ మూవీ.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 13 |
ప్రపంచ రికార్డ్ సృష్టించిన బెల్లకొండ శ్రీనివాస్ మూవీ.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఆయన నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ వెర్షన్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ‘ఖూన్ఖర్’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు 709 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ అందుకున్న చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్.. తమ సినిమాకు గొప్ప విజయం అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ మూవీ 2017లో విడుదలై తెలుగుతోపాటు హిందీలోనూ పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

Next Story

Most Viewed