పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. దేశం విడిచి పారిపోయిన నటి

by Harish |
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. దేశం విడిచి పారిపోయిన నటి
X

దిశ, సినిమా: పెళ్లి కాకుండానే గర్భవతిగా నటించడంపై బనితా సంధు ఓపెన్ అయింది. ‘మదర్ థెరిసా & మి’ చిత్రంతో మే5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను పోషించిన కవిత పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కెరీర్ ఆరంభంలోనే మ్యారేజ్ కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ పోషించడం సవాలుగా మారిందని చెప్పింది. అలాగే నిజ జీవితంలో 25 ఏళ్లకే గర్భం దాల్చిన మదర్ థెరిసా తమ దేశం నుంచి పారిపోయి ఇండియాకు వచ్చిందనే దానితో ఏకీభవించనన్న నటి.. ఈ సినిమా చూస్తే అసలు విషయమేమిటో అందరికీ పూర్తిగా అర్థమవుతుందని తెలిపింది. అలాగే ఆమె గర్భవతి అనే దానిపై దృష్టి పెట్టకుండా ప్రజల కోసం ఏమి చేసిందనే విషయం చూడాలని కోరింది. చివరగా టైటిల్ చూసి అందరూ అనుకున్నట్లు ఇది ఆమె బయోపిక్ కాదన్న బనితా.. తన జీవితంలో ఇదొక అధ్యాయంగా పేర్కొంది.

Also Read: ‘సార్’ అని పిలవనని షారుఖ్‌తో చెప్పేశా.. రిధి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story

Most Viewed