Bandla Ganesh: తాజా ట్వీట్.. కౌంటర్ ఆ డైరెక్టర్‌కేనా?

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-18 07:14:41  IST  )

ఎప్పుడూ ఏదో వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్.

Bandla Ganesh: తాజా ట్వీట్.. కౌంటర్ ఆ డైరెక్టర్‌కేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ ఏదో వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. రాజకీయాలపై, నటులపై ఆయన చేసే కామెంట్స్ తరచూ వివాదాస్పదమవుతూనే ఉంటాయి. కాగా తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ ఆ స్టార్ డైరెక్టర్‌కు కౌంటరా అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

'మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడుగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా' అంటూ ఫైర్ ఎమోజీని తన వ్యాఖ్యలకు జత చేశాడు. అయితే ఈ ట్వీట్ స్టార్ డైరెక్టర్‌ను ఉద్దేశించే పెట్టారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇటీవల భీమ్లానాయక్ సినిమా ఈవెంట్‌కు బండ్ల గణేష్‌ను పిలవలేదు. దీనికి కారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ ఆడియో సైతం లీక్ అయింది. కాగా అది తనది కాదని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. కాగా తాజా ట్వీట్‌తో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చినట్లయింది.

Next Story