బండ్ల గణేష్ అలా చేయడం ఇండస్ట్రీకి చాలా ప్రమాదం.. ఎస్‌కెఎన్ కామెంట్స్ దేని గురించంటే? (వీడియో)

by Mallepaka Hamsa |

నిర్మాత ఎస్‌కెఎన్ (SKN)నిర్మాణంలో వచ్చిన ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

బండ్ల గణేష్ అలా చేయడం ఇండస్ట్రీకి చాలా ప్రమాదం.. ఎస్‌కెఎన్ కామెంట్స్ దేని గురించంటే? (వీడియో)
X

దిశ, సినిమా: నిర్మాత ఎస్‌కెఎన్ (SKN)నిర్మాణంలో వచ్చిన ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎస్ కె ఎన్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ.. పలు ఈవెంట్లకు హాజరవుతూ వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఎస్‌కె‌ఎన్ బండ్ల గణేష్‌(Bandla Ganesh)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అసలు విషయంలోకి వెళితే.. నీరజ కోన దర్శకత్వంలో వచ్చిన ‘తెలుసు కదా’ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda), శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఈనేపథ్యంలోనే సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో బండ్ల గణేష్, నిర్మాత ఎస్‌కెఎన్ పాల్గొన్నారు.

ఇందులో భాగంగా నిర్మాతను ఉద్దేశించి ‘‘మీలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం సినీ పరిశ్రమకు చాలా ప్రమాదకరం. అందుకే మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలి. కాంబినేషన్లు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఒక మేధావి మౌనం దేశానికి ఎంత ప్రమాదకరమో బండ్ల గణేష్ లాంటి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్‌కి దూరంగా ఉంటే ఇండస్ట్రీకి కూడా అంతే ప్రమాదం’’ అని అనడంతో అక్కడున్న వారంతా నవ్వారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

link

Next Story