ప‌వ‌న్ తో కాదు...చిరంజీవితో బండ్ల గణేష్ అదిరిపోయే సినిమా ?

by velandi.Saikiran |   (  Updated:2025-11-04 12:06:21  IST  )

బండ్ల గణేష్ కు చిరంజీవి హామీ కూడా ఇచ్చారట. మంచి కథ తీసుకుని రా.. సినిమా చేస్తా అంటూ బండ్లకు చిరంజీవి బంపర్ ఆఫర్

ప‌వ‌న్ తో కాదు...చిరంజీవితో  బండ్ల గణేష్ అదిరిపోయే సినిమా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా ఫంక్షన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. మొన్న దీపావళి పండుగను గ్రాండ్ గా నిర్వహించి, మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీని కూడా ఏర్పాటు చేశారు బండ్ల గణేష్. అయితే అలాంటి బండ్ల గణేష్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారట.

దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఇప్పటికే బండ్ల గణేష్ కు చిరంజీవి హామీ కూడా ఇచ్చారట. మంచి కథ తీసుకుని రా.. నీ బ్యానర్ లో సినిమా చేస్తా అంటూ బండ్ల గణేష్ కు మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్ ప్రకటించారట. దీంతో మంచి కథ కోసం బండ్ల గణేష్ వేట మొదలు పెట్టినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్త చెక్కర్లు కొడుతోంది. అన్ని ఓకే అయితే జనవరిలోగా సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయ్యే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.

READ MORE ....

మెగాస్టార్ చిరంజీవితో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

Next Story