- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్లలోకి రాబోతున్న ‘బ్యాండ్ మేళం’.. సోలో రిలీజ్ డేట్‌ను పట్టేసిన మేకర్స్
‘బ్యాండ్ మేళం’ సోలో రిలీజ్ తేదీని ఎంచుకోవడం వెనుక మూవీ టీమ్ ఒక పెద్ద వ్యూహాన్నే అమలు చేసినట్లు కనిపిస్తోంది.

దిశ, సినిమా: కోర్ట్’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ జోడీ రోషన్( Roshan), శ్రీదేవి (Sridevi)మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’(Band Melam). ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో, సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కుతున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ చిత్రానికి పాటలు రాయడం, సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్రలో నటించడం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. కొన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రంతో రోషన్, శ్రీదేవిల మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్లాన్ అదుర్స్!
తాజాగా.. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మార్చి 13న ఈ ‘బ్యాండ్ మేళం’ థియేటర్లలో మోగనుంది. అయితే, ఈ తేదీని ఎంచుకోవడం వెనుక మూవీ టీమ్ ఒక పెద్ద వ్యూహాన్నే అమలు చేసినట్లు కనిపిస్తోంది. మార్చి నెలలో పెద్ద సినిమాల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, తమ సినిమాకు అనువైన సమయాన్ని వారు పట్టేశారు. మార్చి 6న కొన్ని సినిమాలు విడుదలవుతుండగా, మార్చి 13న ‘బ్యాండ్ మేళం’తో పాటు ‘19 డెకాయిట్’, ‘ధురంధర్-2’, ‘టాక్సిక్’ వంటి క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. కానీ, ప్రస్తుతానికి ‘బ్యాండ్ మేళం’కు దాదాపు సోలో రిలీజ్ డేట్ దొరికినట్లే అని అంతా అభిప్రాయపడుతున్నారు. చిన్న సినిమా కావడం, బడ్జెట్ పరిమితులు ఉండటంతో చిత్రానికి మంచి టాక్ వస్తే చాలు, వారం రోజుల్లోనే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేయాలనేది కోన వెంకట్ ప్లాన్ అని అంతా చర్చించుకుంటున్నారు. ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తూ సరైన డేట్‌ను బ్లాక్ చేసిన ‘బ్యాండ్ మేళం’ టీమ్ స్ట్రాటజీ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితమే వచ్చేలా కనిపిస్తోందని సినీ ప్రియులు అంటున్నారు.






