అభిమానులకు బాలయ్య ఉగాది గిఫ్ట్.. NBK 108 ఫస్ట్ లుక్ రిలీజ్

by Disha Web Desk 4 |
అభిమానులకు బాలయ్య ఉగాది గిఫ్ట్.. NBK 108 ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: వీర సింహా రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే NBK 108 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్స్‌గా మెరవనున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఇటీవల సినిమా సెట్‌లో కాజల్ అడుగుపెట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి ఉగాది కానుక ఇచ్చారు సినిమా మేకర్స్. కాసేపటి క్రితం ఈ చిత్రం నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో బాలయ్య మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఇవి కూడా చదవండి:

Mahesh Babu: రాజమౌళి, మహేష్ సినిమా బడ్జెట్ ఏంతో తెలుసా?


Next Story

Most Viewed