- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతికి మరో సినిమాతో బాలయ్య..డైరెక్టర్ ఎవరంటే ?
దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలయ్య కొత్త సినిమా లాక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు చేసుకుంటూనే, అటు రాజకీయాల్లో కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఏడాదికి కనీసం రెండు లేదా ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, సినిమాను మాత్రం మర్చిపోవడం లేదు బాలయ్య. ఇటీవల అఖండ 2 సినిమాతో బంపర్ హిట్ అందుకున్న బాలయ్య, మరో ప్రాజెక్టు ఓకే చేసినట్లు తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలయ్య ?
సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలయ్య కొత్త సినిమా లాక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సింగిల్ సిట్టింగ్ లోనే కొరటాల శివ చెప్పిన కథను బాలయ్య ఓకే చెప్పినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ ఫైనల్ గా మారింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
కొరటాల శివ, బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీలో బాలయ్య పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని టాక్. దీంతో సినిమా బంపర్ హిట్ కావడం గ్యారెంటీ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటే కొరటాల శివ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని టాక్ నడుస్తోంది. క్లిక్






