- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య ఒక పవర్ హౌస్.. ఆయనతో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. ఆది పినిశెట్టి ఆసక్తికర కామెంట్స్
నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ-2’(Akhanda-2).

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ-2’(Akhanda-2). బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్‌గా రాబోతుడటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య సరసన సంయుక్త మీనన్ (Samyuktha Menon)హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇందులో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) విలన్‌గా కనిపించబోతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బాలయ్యతో నటించడంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘బాలకృష్ణ స్క్రీన్‌పై ఎలా కనిపిస్తారో.. నిజజీవితంలోనూ అలాగే ఉంటారు. ఆయన ఒక పవర్ హౌస్ లాంటి వారు. సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి స్ఫూర్తి. కష్టపడి పనిచేస్తారు. నేను బాలయ్య నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
బోయపాటి దర్శకత్వంలో ఓ మ్యూజిక్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మనందరిలో విలన్లు ఉన్నారని నేను అనుకుంటున్నాను. పరిస్థితి మనం పాజిటివ్, నెగెటివ్‌గా ఆలోచిస్తాము. ఎప్పుడూ పాజిటివ్ ఉండే పాత్రలు చేస్తే ఒక దశ తర్వాత ఆసక్తి ఉండదు. విలన్ పాత్రలకు హద్దు ఉండదు. నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రతి నాయకుడి పాత్రలు చాలా ఆసక్తిగా ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. కాగా.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘అఖండ-2’ సినిమా పలు వాయిదాలు పడుతూ నందమూరి అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ సెప్టెంబర్ 25న రాబోతున్నట్లు ప్రకటించారు.






