- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోధుడిగా బాలయ్య..‘NBK-111’ నుంచి పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేస్తూ బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కలయికలో ఓ సినిమా రాబోతుంది.

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కలయికలో ఓ సినిమా రాబోతుంది. ‘వీర సింహారెడ్డి’ ఘన విజయం తర్వాత రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. ‘NBK-111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. నేడు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో బుచ్చిబాబు సనా, బోయపాటి శ్రీను బాబీ కొల్లి పాల్గొన్నారు. ఈ ఫొటలతో పాటు మూవీ మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వెల్లడించారు.
ఒక పోస్టర్‌లో బాలయ్య రెండు లుక్స్‌లో కనిపిస్తూ అంచనాలను పెంచుతున్నారు. యోధుడి పాత్రలో ఒక లుక్ ఉండగా.. మెడలో రుద్రాక్షమాలతో పవర్ ఫుల్ లుక్‌లో కనిపించాను. రెండు కోటలపై ఈ పోస్టర్ చూస్తుంటే బాలయ్య కోసం, గోపీచంద్ భారీగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. కాగా.. ఇందులో బాలయ్య సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్నా భాటియా ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు సమాచారం. ‘NBK-111’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చేయనున్నట్లు టాక్.






