రెండోసారి తండ్రి అయిన ‘బలగం’ డైరెక్టర్ వేణు యల్దండి.. ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 6 |
రెండోసారి తండ్రి అయిన ‘బలగం’  డైరెక్టర్ వేణు యల్దండి.. ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ వేణు యల్దండి మొదట జబర్దస్త్ షో తో బుల్లి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘బలగం’ సినిమాకు దర్శకత్వం వహించి సంచలనం సృష్టించాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో బలగం తెరకెక్కించాడు. ఈ ఏడాది విడుదలైన బలగం సంచలన విజయం సాధించింది. చిన్న చిన్న కారణాలతో విడిపోయిన కుటుంబ సభ్యులు ఈ సినిమా చూసి కలిసిపోయారు. అంతర్జాతీయంగా బలగం అనేక అవార్డులు కొల్లగొట్టింది. ఒక్క సినిమాతో వేణు పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. ఇదిలా ఉంటే వేణుకు ఇదివరకు ఓ కొడుకు ఉన్నాడు.

తాజాగా, ఇప్పుడు వేణు మరోసారి తండ్రిగా ప్రమోషన్ తీసుకున్నారు. ఆయన భార్య పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వేణు తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఆడపిల్ల పుట్టింది. ఈ శుభవార్తను నా పెద్ద కుటుంబంతో పంచుకోవడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే కూతురిని ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Next Story

Most Viewed