నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

by Mallepaka Hamsa |

ఇప్పటికే టాలీవుడ్‌లో తనదైన స్టామినాతో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ(Balakrishna).. వరుస విజయాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.

నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్..!
X

దిశ, సినిమా: ఇప్పటికే టాలీవుడ్‌లో తనదైన స్టామినాతో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ(Balakrishna).. వరుస విజయాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అఖండతో మొదలైన హిట్ పరంపర వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరకు కొనసాగింది. ముఖ్యంగా ‘అఖండ-2’ సైతం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో బాలయ్య మార్కెట్ మరింత బలపడింది. వయసు పెరిగినా ఎనర్జీ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీగా నిలుస్తున్నారు. ఈక్రమంలో.. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కాంబినేషన్‌లో రాబోతున్న ‘NBK-111’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైందన్న వార్తే అభిమానుల్లో జోష్ నింపింది. అంతేకాదు బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుండటం, ఈసారి బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారన్న సమాచారం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.

ఈ సారి బాలయ్య సరికొత్త అవతారంలో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఓటిటి డీల్స్ తగ్గడం, హిందీ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే పడిపోవడం వంటి కారణాలతో మేకర్స్ కథలో మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొదట అనుకున్నంత గ్రాండ్‌గా కాకుండా.. సింపుల్ స్టోరీతో, బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే దిశగా సిద్ధం చేస్తున్నారట. భారీ స్కేల్ సినిమా ఆశించిన బాలయ్య అభిమానులు మాత్రం కొంత నిరాశ చెందుతున్నారు. మరోవైపు, బాలయ్యకు కథ బలంగా ఉంటే స్కేల్ అవసరం లేదని, సింపుల్ కథతో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసే సత్తా ఆయనకు ఉందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ‘NBK-111’పై అంచనాలు మాత్రం తగ్గడం లేదు.

Next Story