మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్!

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’ (peddi)సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’ (peddi)సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే స్టార్స్ దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్ కుమార్ (Shivaraj Kumar)ప్రధాన పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచగా.. ఇటీవల విడుదలైన ‘చికిరి.. చికిరి’ సాంగ్ ఏకంగా 13 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంటూ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

ఒక్కొక్క అప్డేట్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం రామ్ చరణ్ ఇండస్ట్రీని షేక్ చేస్తాడనిపిస్తోంది. త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయనున్నట్లు టాక్. అయితే ‘పెద్ది’ సినిమా తర్వాత పలు ప్రాజెక్ట్‌లు చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా, రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకుని అభిమానులకు షాకిచ్చారు. ఆయన భార్య ఉపాసన(Upasana) ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది.

అయితే రామ్ చరణ్ ఆమె పక్కనే ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తన సమయాన్ని తన భార్య పుట్టబోయే పిల్లలకు కేటాయించాలని అనుకుంటున్నారట. అందుకే త్వరగా ‘పెద్ది’ షూట్ కంప్లీట్ చేసి ఇంటికే పరిమితం కావాలని చూస్తున్నాడు. కొద్ది కాలంపాటు సినిమాలకు బ్రేక్ కుటుంబంతో గడపబోతున్నట్లు టాక్. రామ్ చరణ్ గతంలో క్లిన్ కారా పుట్టినప్పుడు కూడా ఇలాగే చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి తన ఫ్యామిలీ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు ఆయనను పొగుడుతున్నారు.

Next Story