- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బాఘీ-4’ బిగ్ అప్డేట్ రాబోతోంది.. మారణహోమానికి కౌంట్‌డౌన్ స్టార్ట్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సోనమ్ బజ్వా(Sonam Bajwa) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సోనమ్ బజ్వా(Sonam Bajwa) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ప్రస్తుతం ‘భాఘీ-4’(Baaghi 4)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు సోనమ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ‘‘కోడ్ క్రాక్ అయింది. ఆగస్టు 11న మధ్యాహ్నం 1:11 గంటలకు ‘బాఘీ-4’ ప్రాణం పోసుకుంటుంది. మీరు ఎప్పటికీ మర్చిపోలేని తేదీ, సమయం కాబోతోంది.
ట్రిపుల్ 1లు కేవలం సంఖ్యలు కాదు.. గందరగోళం, ధైర్యం, మారణహోమానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లు సూచనలు. దానిని గుర్తించండి.. అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి. ‘బాఘీ-4’ మీ కోసం వస్తుంది.. వెనక్కి తగ్గేది లేదు’’ అని రాసుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) హీరోగా నటిస్తుండగా.. హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీని సాజిద్ నడియావాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది.






