ఆ సెక్స్ సీన్లు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి.. అమ్మతోనూ చెప్పలేకపోయా..

by Prasanna |
ఆ సెక్స్ సీన్లు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి.. అమ్మతోనూ చెప్పలేకపోయా..
X

దిశ, సినిమా: జీవితాన్ని ఒకలా ఊహించుకుంటే విధి మరోలా మార్చేసిందంటోంది ఆయేషా కంగా. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాల గురించి మాట్లాడిన నటి.. చిన్నప్పటి నుంచి తనకు డిజైనర్ మాత్రమే కావాలని కోరిక ఉండేదని, దీంతో ఎనిమిది ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచం గురించి తెలుసుకోవడం ప్రారంభించినట్లు చెప్పింది. అయితే తాను అనుకున్న ప్రణాళికలన్నీ తారుమారై చివరికి తాను నటిగా మారిపోతానని ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది. ‘సినీ పరిశ్రమలోని స్త్రీలను ప్రజలు దారుణంగా ట్రోల్ చేస్తారు. చాలామంది ఒత్తిడికి గురికావడం నేను గమనించాను. అందుకే ఇటు వైపు రావాలనుకోలేదు. కానీ, షోబిజ్ ప్రపంచంలోకి నా ప్రవేశం చాలా హఠాత్తుగా జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల ద్వారా గొప్ప గుర్తింపు వచ్చినప్పటికీ.. మా అమ్మతో సన్నిహిత సన్నివేశాల గురించి మాట్లాడేందుకు భయపడ్డాను. పురుషులతో బెడ్ సీన్ల గురించి కుటుంబసభ్యులతో చర్చించడం సవాలుగా మారింది. ఒక నటిగా నేను ఇప్పటికీ ఒత్తిడికి గురవుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed