ఆస్కార్ వేదికపై అద్భుతం.. లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చిన నిండు గర్భిణీ

by Disha Web Desk 7 |
ఆస్కార్ వేదికపై అద్భుతం.. లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చిన నిండు గర్భిణీ
X

దిశ, వెబ్‌డెస్క్: లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95 వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఆస్కార్ బరిలో ‘నాటు నాటు’ సాంగ్ అవార్డు దక్కించుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. అయితే.. ఈ ఆస్కార్ వేదికపై మరో అద్భుతం జరిగింది. నిండు గర్భిణీ అయిన సింగర్ ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. దీంతో ఆ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ లేచి మరీ చప్పట్లు కొట్టారు.

రిహన్న అనే సింగర్ పాట ‘‘బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్‌’’ ఆస్కార్ 2023 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ చేయబడింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ద్వారా రిహన్న నామినేట్ కావడం ఇదే మొదటిసారి. అయితే, ఆమె పాట ‘‘RRR’’ లోని నాటు నాటు సాంగ్‌తో ఓడిపోయింది. అయినప్పటికీ స్టేజ్‌పై ఆమె ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంది.

95వ అకాడమీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై తన బేబీ బంప్‌ను ప్రదర్శించిన ఆమె.. నలుపు రంగు, వెండి దుస్తులను ధరించి వేదికపైకి వచ్చింది. వైడ్-లెగ్ ట్రౌజర్‌తో జతగా ఉన్న షీర్ టాప్‌లో ఆమె బేబి బంప్‌ని చూపిస్తూ ఆమె డ్రాప్-డెడ్ గార్జియస్‌గా కనిపించింది. ఆమె బేబి బంప్‌తో ఇచ్చిన పర్ఫామెన్స్‌కు ఆస్కార్ వేడుకలో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి మరీ చపట్ల రూపంలో అభినందనలు తెలిపారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed