- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Avatar 2' లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ ధరలు
'అవతార్ 2' సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. పోటీగా ఇండియన్ సినిమాలు వచ్చినా 10వ రోజు కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది

దిశ, సినిమా: 'అవతార్ 2' సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. పోటీగా ఇండియన్ సినిమాలు వచ్చినా 10వ రోజు కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.7000 కోట్లకు పైగా సంపాదించింది. ఇదిలావుంటే.. అవతార్ మూవీ లవర్స్‌కు ఒక గుడ్‌న్యూస్ వచ్చింది. 'అవతార్ 2' త్రిడి వెర్షన్ టికెట్ ధరలు తగ్గాయి. IMAX, 4DXలు కాకుండా 3డి వెర్షన్ టికెట్ ధరను రూ.300 నుంచి రూ.150కి తగ్గించారు.
థియేటర్లకు వచ్చే జనాల్లో ఎక్కువగా త్రిడి వెర్షన్ చూడటానికే ఇష్టపడుతున్నట్టు కలెక్షన్స్ చెబుతున్నాయి. ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచేందుకు టికెట్ ధర తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాచేస్తే మరిన్ని డబ్బులు వసూల్ చేసుకోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో పాటు 3D కళ్లద్దాల ఛార్జీలు కూడా థియేటర్‌లలో కూర్చునే సీట్ ఆధారంగా రూ.20 నుంచి రూ. 50 వరకూ ఉంటుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి : 'జాన్ సే...' నుంచి అంకిత్ ఫస్ట్ లుక్






