- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసిస్టెంట్ డైరెక్టర్‌ను దారుణంగా మోసం చేసిన సమంత.. ఫ్యాన్స్ కూడా అసహ్యించుకునే తప్పు..
‘తెలుసు కదా’ సినిమా రిలీజ్ అయింది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కానీ నటీనటులు సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ తనదని సంచలన ఆరోపణలు చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్.

దిశ, వెబ్ డెస్క్ : ‘తెలుసు కదా’ సినిమా రిలీజ్ అయింది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కానీ నటీనటులు సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ తనదని సంచలన ఆరోపణలు చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్. నిజానికి ఈ స్టోరీ ఫిమేల్ సెంట్రిక్ అని.. ముందుగా రష్మిక మందన్న, తర్వాత సమంతకు ఈ కథ చెప్పినట్లు తెలిపాడు. సామ్, నాని, నితిన్‌తోపాటు ప్రొడ్యూసర్లతో ఇందుకు సంబంధించిన చాట్ గురించి స్క్రీన్ షాట్స్ పంచుకున్నాడు.
ఈ కథను సామ్ తన దీర్ఘకాలిక మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ నీరజ కోనకు కథను లీక్ చేసి ఉండొచ్ని.. తాను మేల్ సెంట్రిక్ మూవీగా మార్చి.. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, నైట్రోజన్ వంటి థీమ్‌లు జోడించి సినిమా చేసిందని అలిగేషన్స్ చేశాడు. ఇప్పటికే స్క్రీన్ ప్లే రాసుకున్నానని.. కానీ ఈ కథను చాలా బలహీనంగా మార్చేశారని బాధపడ్డాడు. రెడిట్‌లో మొదలైన ఈ టాపిక్ సోషల్ మీడియా వరకు వచ్చేయగా.. సమంత ఇంత పని చేసిందంటే ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారని.. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కూడా అసహ్యించుకునే తప్పు అవుతుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.






