ఆయనతో పనిచేయాలనేది నా డ్రీమ్ : యంగ్ బ్యూటీ Ashika ranganathan

by Phanindra |   (  Updated:2023-02-09 17:11:53  IST  )

యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఆయనతో పనిచేయాలనేది నా డ్రీమ్ : యంగ్ బ్యూటీ Ashika ranganathan
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. కళ్యాణ్ రామ్ సరసన ఆమె నటించిన తాజా చిత్రం 'అమిగోస్' ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. నందమూరి ఫ్యామిలీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవడం ఆనందంగా ఉందని చెప్పింది. అలాగే రీసెంట్‌గా రిలీజైన 'ఎన్నో రాత్రులొస్తాయి గాని' అనే సాంగ్, అందులో తన ఫర్ఫార్మెన్స్ గురించి ప్రతిఒక్కరూ మాట్లాడుకోవడం హ్యాపీగా ఉందని తెలిపింది. ఇక తన డ్రీమ్ గురించి మాట్లాడుతూ.. 'దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పనిచేయాలని ఆశగా ఉంది. అదే నా బిగ్ డ్రీమ్. ఎందుకంటే హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రాజమౌళిగారి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. నేను అదే కోరుకుంటున్నా. ఇక 'అమిగోస్' తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తాయని ఆశిస్తున్నా' అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Bimbisara 2 : 'బింబిసార 2' అప్‌డెట్ ఇచ్చిన Kalyan Ram!

Next Story