57 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడంపై ఆషికా రంగనాథ్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), కిశోర్ తిరుమల (Kishore Tirumala)కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi).

57 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడంపై ఆషికా రంగనాథ్  షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), కిశోర్ తిరుమల (Kishore Tirumala)కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi). లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీ సినిమాస్), జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా..సత్య, వెన్నెల కిశోర్, సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడాపై సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.

57 ఏళ్ల వయసు ఉన్న రవితేజతో తన వయసులో సగం ఉన్న హీరోయిన్లు డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్‌లతో రొమాన్స్ చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలా జరగడం మొదటిసారి ఏమ్ కాదు. ఇంతకు ముందు శ్రీలీలతో ‘ధమాకా’ చేయడంపై కూడా ఇలాగే ట్రోలింగ్ జరిగింది. మరీ ముఖ్యంగా ‘మిస్టర్ బచ్చన్’ మూవీలో భాగ్యశ్రీ బోర్తే విషయంలోనూ ఇలానే ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, రవితేజతో రొమాన్స్ చేయడంపై ఆషికా రంగనాథ్ (Ashika Ranganath)షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను నా పనిని కేవలం ఓ నటిని అన్న కోణం నుంచే చూస్తాను. విభిన్నమైన పాత్రలు చేయాలన్న దానిపైనా నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నా క్యారెక్టర్ యంగ్ అండ్ మోడరన్‌గా ఉంటుంది. గతంలో నాగార్జున గారితో నాసామి రంగా మూవీలో నేను పరిణితి చెందిన పాత్ర పోషించాను. నేను విలక్షణత, నాలోని బహుముఖ ప్రజ్ఞను చూపించాలి అనుకుంటాను. ఈ విషయంలో నా సహనటుడి వయసు నన్ను, నా నిర్ణయాన్ని ప్రభావితం చేయదు. నేను ఈ పాత్రకు ఎంత వరకు సెట్ అవుతాను.. ఆ పాత్రను ఎంత వరకు పోషించగలను అనే దానిపై దృష్టి పెడతాను. అది యంగ్ హీరో ప్రాజెక్ట్ అయినా, సీనియర్ హీరో సినిమానా అన్న పట్టింపు నాకు లేదు. ఎవరైనా ఒకే కథకు నా పాత్ర ఎంతగా దోహదపడుతుంది అనేది నాకు ముఖ్యం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story