నాని సినిమాలో గ్లామర్ టచ్.. ఆషికా రంగనాథ్ ఎంట్రీతో అంచనాలు డబుల్!

by Mallepaka Hamsa |

‘నా సామిరంగ’ మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆషికా, ఇప్పుడు నేచురల్ స్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేయడం విశేషం.

నాని సినిమాలో గ్లామర్ టచ్.. ఆషికా రంగనాథ్ ఎంట్రీతో అంచనాలు డబుల్!
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దీంతో పాటు నాని, సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘బ్లడీ రోమియో’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే దానిపై గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో నానికి జోడీగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘నా సామిరంగ’ మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆషికా, ఇప్పుడు నేచురల్ స్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక నాని, ఆషికా రంగనాథ్ కలిసి నటించడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సరికొత్త జోడీ వెండితెరపై ఎలా ఉండబోతోందని చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. సుజిత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. మరి ‘బ్లడీ రోమియో’లో ఆషికాను సుజిత్ ఎలా చూపిస్తారో అన్నది ఆసక్తికిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. నాని ఒకవైపు శ్రీకాంత్ ఓదెలతో రా అండ్ రస్టిక్ మూవీ చేస్తూనే, మరోవైపు సుజిత్ దర్శకత్వంలో ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను లైన్‌లో పెట్టడం ఆయన ప్లానింగ్‌కు నిదర్శనం. సోషల్ మీడియాలో ఈ సినిమా అప్‌డేట్స్ చూస్తుంటే, నాని ఈసారి తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుని ఒక కొత్త తరహా గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ఆషికా ఎంట్రీతో ఈ సినిమాకు మరింత గ్లామర్ అండ్ క్రేజ్ తోడైంది. అంతేకాకుండా ‘బ్లడీ రోమియో’ మూవీపై అంచనాలు డబుల్ అయ్యాయి.

Next Story