అమ్మాయిల సొంత గుర్తింపు తొక్కేస్తున్న అబ్బాయిలు: Asha Negi

by Hajipasha |   (  Updated:2022-09-05 14:09:47  IST  )

దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ ఆశా నేగి తన వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్‌లో ఓపెన్‌గా మాట్లాడటాన్ని ఇష్టపడనంటోంది.Latest Telugu News

అమ్మాయిల సొంత గుర్తింపు తొక్కేస్తున్న అబ్బాయిలు: Asha Negi
X

దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ ఆశా నేగి తన వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్‌లో ఓపెన్‌గా మాట్లాడటాన్ని ఇష్టపడనంటోంది. ప్రస్తుతం ఎలాంటి లవ్, డేటింగ్‌లు లేకుండా ఒంటరిగానే ఉన్నానన్న ఆమె ఒకసారి తెగిపోయిన బంధం గురించి మళ్లీ మళ్లీ తలచుకుని బాధపడటం కూడా నచ్చదని చెప్పింది. నటుడు రిత్విక్‌‌తో ఏడేళ్లుగా డేటింగ్ చేసి ఇటీవల బ్రేకప్ చెప్పేసిన ఆశ.. వీలైనంత వరకు పర్సనల్ మ్యాటర్స్‌ను గోప్యంగా ఉంచుకోవడమే బెటర్ అని తెలిపింది.

ఇక రిత్విక్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆయన స్నేహితురాలిగానే గుర్తించి పిలిచేవారన్న ఆమె.. తనకు సొంత గుర్తింపు ఉందనే విషయాన్ని తొక్కిపెట్టడం ఇబ్బంది పెట్టినట్లు వెల్లడించింది. ఇక ఈ కారణంతోనే ఇండస్ట్రీలో ప్రైవేట్‌ వ్యక్తిగా ఉండాలనుకున్నాననే తప్ప.. నిజానికి తాను రహస్యంగా ఉండే మనిషిని కాదని తెలిపింది. చివరగా తన మనసులో మరొకరి ప్రేమకు స్థలం ఉందన్న హాటీ.. కానీ ప్రేమించేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Also Read : పెళ్లి కాకపోతే పిల్లలను కనొద్దని రూల్ ఉందా? : స్టార్ హీరోయిన్

Also Read : పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఎదగడం సవాలే: Aishwarya Rai Bachchan

Next Story