- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉన్నఫలంగా చెడు అలవాటు మానుకున్న విశాల్..
పేరుకు తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విశాల్.

X
దిశ, సినిమా: పేరుకు తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విశాల్. రీసెంట్‌గా వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్.. చాలా కాలం తర్వాత సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తన వ్యక్తిగత విషయాలు బయటపెట్టాడు విశాల్. ‘నాకు సిగరెట్ కాల్చే అలవాటు చాలా ఎక్కువ. కాలేజీ సమయంలో, ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చైన్ స్మోకర్‌గా ఉండేవాడిని. ఇలా ధూమపానానికి బానిసైపోయా. ప్రతి రోజు దాదాపు 25 సిగరెట్ల వరకు కాల్చేవాడిని. కానీ ఒక వ్యక్తికి ఉన్న చెడు అలవాట్ల కన్నా వారికి ఉన్న దృఢ సంకల్పం చాలా గొప్పదని ఆలోచించి ఉన్నఫలంగా ఈ అలవాటు మానుకోవాలని నిశ్చయించుకున్నా. అంతే లాస్ట్ సిగరెట్ ఫ్లష్ చేసి ఆ హ్యాబిట్ మానేసా’ అంటూ విశాల్ తెలిపారు.
- Tags
- vishal
Next Story






