ఇండియాలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ 'కెప్టెన్'.. సర్‌ప్రైజ్ చేస్తుంది: హీరో Arya

by Dishanational2 |
ఇండియాలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ కెప్టెన్.. సర్‌ప్రైజ్ చేస్తుంది: హీరో Arya
X

దిశ, సినిమా : శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'కెప్టెన్'. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌ నిర్మాణ సంస్థ 'ది స్నో పీపుల్' పతాకంపై ఆర్య నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన హీరో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ఇదే. ఆర్మీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ వింత జీవి స్టోరీ ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది. భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో రిస్క్ చేసి తీసిన సన్నివేశాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తాయి. 'కెప్టెన్' మంచి విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్ ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాత సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్న చిత్రానికి డి ఇమాన్ సంగీతం అందించాడు.




Next Story

Most Viewed