అరుంధతి రీమేక్.. అనుష్క స్థానంలో ఆ అందాల తార ఫిక్స్ ?

by velandi.Saikiran |

15 సంవత్సరాలు అయిన తర్వాత, రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారట.

అరుంధతి రీమేక్.. అనుష్క స్థానంలో ఆ అందాల తార ఫిక్స్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అరుంధతి.. ఈ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమాతో జనాలను భయపట్టించేశారు హీరోయిన్ అనుష్క. లేడి ఓరియంటెడ్, హారర్ కథ అంశంతో వచ్చిన ఈ సినిమా, ఇండస్ట్రీని షేక్ చేసేసింది. 2009 జనవరి 16వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా... బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇందులో అనుష్క నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ అరుంధతి సినిమా సక్సెస్ తర్వాత అనుష్క స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.

అయితే ఈ సినిమా వచ్చి 16 సంవత్సరాలు అయిన తర్వాత, రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారట. గీత ఆర్ట్స్ బ్యానర్ పై మోహన్ రాజా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీలను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. అటు సోనుసూద్‌ పాత్రలో అతనే నటిస్తారని తెలుస్తోంది.

Next Story