అరియానా గ్లోరీ సూసైడ్ చేసుకుంటోన్న వీడియో వైరల్

by Disha Web Desk 9 |
అరియానా గ్లోరీ సూసైడ్ చేసుకుంటోన్న వీడియో వైరల్
X

దిశ, సినిమా: యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అతి తక్కువ సమయంలో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న వారిలో అరియానా పేరు కూడా చెప్పుకోవచ్చు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. హౌస్ లో జెన్యూన్ గా టాస్క్ లు ఆడి.. లేడీ టైగర్ గా ట్యాగ్ సంపాదించుకుంది.

ఇక ఆర్జీవీతో ఇంటర్వ్యూ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఏ మాత్రం సమయం దొరికినా ఈ బ్యూటీ హాట్ ఫొటో షూట్ల తో రెచ్చిపోతుంటుంది. తన స్టన్నింగ్ లుక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటోన్న ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో అరియానా ఫ్యాన్ కు క్లాత్ కట్టి.. ఉరి వేసుకున్నట్లు కనిపిస్తుంది.

ఆ సమయంలోనే తన ఫ్రెండ్ వచ్చి హ్యాండ్ బ్యాగ్ లో నుంచి నెయిల్ పాలిష్ తీసి చూపిస్తుంది. దీంతో వెంటనే అరియానా ఉరి వేసుకోవడం ఆపి కిందకు దిగుతుంది. తర్వాత తన ఫ్రెండ్ తో నెయిల్ పాలిష్ వేయించుకుంటుంది. ఈ వీడియోకు ‘మా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు’ అని క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం అరియానా సూసైడ్ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు అరియానా పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Read More..

‘ఆల్ ది బెస్ట్ మై లవ్’.. ఫ్యామిలీ స్టార్ మూవీపై రష్మిక ఆసక్తికర ట్వీట్.. క్యూటెస్ట్ రిప్లై ఇచ్చిన హీరో!



Next Story

Most Viewed