మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్స్ కూడానా..? అయ్య బాబోయ్ ఈ ట్వీస్ట్ మాములుగా లేదుగా

by Dishafeatures1 |
మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్స్ కూడానా..? అయ్య బాబోయ్ ఈ ట్వీస్ట్ మాములుగా లేదుగా
X

దిశ,సినిమా:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అందరి దృష్టి మహేష్-రాజమౌళి సినిమా పైనే ఉంది. ఇటీవల రాజమౌళి తండ్రి దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

రకరకాలుగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లాంచింగ్ పూజా కార్యక్రమాలు కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా మే 30వ తేదీన జరగబోతున్నాయట. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నెట్టింట లీకై వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా - జాన్వీ కపూర్ - ఇండోనేషియన్ బ్యూటీ ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అలాగే సిమ్రాన్- జ్యోతిక ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కూడా నటించబోతున్నారట. వాళ్ళిద్దరీ పాత్ర ఈ సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతున్నాయట.

ఇక ఈ ఇద్దరి విషయానికి వస్తే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్.. ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఏలేసి ఇప్పుడు సీనియర్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. అయితే రాజమౌళి పర్సనల్ గా వెళ్లి సిమ్రాన్ ను ఈ సినిమాలో రోల్ కోసం ఒప్పించాడట . అదే విధంగా జ్యోతిక కూడా కంటెంట్ నచ్చితే ఆ సినిమాను ఓకే చేస్తుంది. అయిన రాజమౌళి సినిమాను ఏ హీరోయిన్ అయినా వదులుకోగలదా..? అందుకే ఇద్దరు కూడా ఓకే చేశారట. మొత్తంగా ఐదు మంది స్టార్ బ్యూటీలు ఈ సినిమాలో నటించబోతున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. చూద్దాం మరి దీనిపై రాజమౌళి - మహేష్ బాబు ఏ విధంగా స్పందిస్తారో.

Next Story

Most Viewed