అనుష్క లైఫ్‌లో ఇన్ని ఎఫైర్స్ ఉన్నాయా? ఆ హీరోలతో ఉన్న బంధం ఇలాంటిదా? క్లారిటీ?

by Disha Web Desk 9 |
అనుష్క లైఫ్‌లో ఇన్ని ఎఫైర్స్ ఉన్నాయా? ఆ హీరోలతో ఉన్న బంధం ఇలాంటిదా? క్లారిటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన నటించి అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం స్వీటీ బరువు పెరగడంతో సినిమాలకు దూరమైనట్లు వార్తలు వినిపించాయి. చాలా రోజుల తర్వాత రీసెంట్‌గా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ లో నవీన్ సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే గతంలో అనుష్కకు స్టార్ హీరోలతో రిలేషన్ ఉందంటూ రూమర్లు వచ్చాయి. యజ్ఞం మూవీ షూటింగ్‌లో గోపిచంద్-అనుష్క ప్రేమలో పడ్డారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. తర్వాత సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్ ప్రేమించుకుంటున్నారంటూ పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ టాక్ వినిపించింది.

ఇక ప్రభాస్ - అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రీసెంట్‌గా వీరిద్దరికి పెళ్లై.. ఓ బాబు కూడా పుట్టినట్లు ఫొటోలు క్రియేట్ చేసి ఓ రేంజ్‌లో వైరల్ చేశారు. కాగా వీరందితో అనుష్కకున్న బంధం కేవలం స్నేహం మాత్రమేనని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. నిన్న (నవంబరు 07) ఈ బ్యూటీ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అనుష్క-ప్రభాస్ మధ్య నిజంగా ప్రేమబంధమే అయితే ఇప్పటికే వివాహం చేసుకునే వారు కదా? ఇన్నేళ్లలో ఒక్కసారైనా నోరు విప్పేవారు? నిజంగా వీరి ప్రెండ్షిప్ గెప్పది అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.



Next Story

Most Viewed