సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాతో క్లారిటీ ఇచ్చేశాడుగా?

by Disha Web Desk 6 |
సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాతో క్లారిటీ ఇచ్చేశాడుగా?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతుల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఈ కపుల్ ఏవో కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వీరి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఓ టాక్ షోలో సానియా, షోయబ్ కలిసి పాల్గొనడంతో పుకార్లకు చెక్ పడింది.

తాజాగా, మరోసారి వీరిద్దరి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే.. షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మార్పులు చేశాడు. గతంలో ఆయన సూపర్ ఉమెన్ సానియా మీర్జా భర్త అని పెట్టుకున్నాడు. కానీ, ఇప్పుడు దాన్ని తొలగించాడు. అది చూసిన నెటిజన్లు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని అందుకే షోయబ్ అలా చేసి క్లారిటీ ఇచ్చాడని అనుకుంటున్నారు. కాగా, షోయబ్, సానియా విడాకులు తీసుకున్నట్లు అధికారిక ధృవీకరణ లేదు. వీరిద్దరూ తమ విడాకుల అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వీరి విడాకులు వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.Read More:


Read More: అందమైన అమ్మాయి ఆ స్టార్ హీరోయినే.. నా కోరిక తీరిందంటూ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story

Most Viewed