దీపికాకు అర్చన స్ట్రాంగ్ కౌంటర్.. పని గంటల విషయంలో అలా జరగని పని అంటూ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-03 03:50:43  IST  )

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

దీపికాకు అర్చన స్ట్రాంగ్ కౌంటర్.. పని గంటల విషయంలో అలా జరగని పని అంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న ఆమె ఇటీవల మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలోనే దీపికాకు పలు భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆమె 8 గంటల పని దినాలు ఉండాలని దర్శకనిర్మాతలకే కండిషన్స్ పెట్టడంతో సెలెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ నుంచి తొలగించడంతో వివాదం కాస్త మరింత ముదిరింది. ఇక ‘స్పిరిట్, కల్కి వంటి సినిమాల్లో దీపికాను సెలెక్ట్ చేసి తొలగించేశారు. కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడమే దీనికి కారణం అనే ప్రచారం జరుగుతోంది. ఇక కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు.

తాజాగా, ప్రొడ్యూసర్ అర్చన (Archana)ఓ ఇంటర్వ్యూలో భాగంగా పని గంటల ఇష్యూపై స్సందించి అసలు నిజాలు బయటపెట్టింది. ‘‘9నుంచి 5 గంటల వరకు షూటింగ్ అనేది జరగని పని. ఎందుకంటే డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ కాల్ షీట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సన్‌రైజ్ కాల్ షీట్ ఉంటే.. ఇంకొన్ని సార్లు సన్సెట్ కాల్ షీట్ ఉంటుంది. ఒకవేళ ఆధివారం షూటింగ్ చేశామంటే.. కాల్ షీట్స్ కాస్ట్ డబుల్ అవుతుంది. ఒక సినిమాకు సంబంధించిన ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు దానిలో కచ్చితంగా ఫినిష్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలా ఫినిష్ చేయకుంటే.. చాలా ప్రాజెక్ట్స్‌పై ఇంట్రెస్ట్‌లు పెరిగిపోతాయి.

మేము ప్రొడక్షన్ హౌస్ పరంగా కరెక్ట్ సమయానికి శాలరీస్ ఇవ్వాలి. అలా చేయాలంటే టైమ్ పాటిస్తే సరిపోదు.. పని కూడా ముఖ్యమే. నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇటీవల ఓటీటీల వలన.. అవే రిలీజ్ డేట్‌ కరెక్ట్‌గా పెట్టడం వల్ల షూటింగ్స్ కూడా పూర్తవుతున్నాయి. కొన్న మాత్రం విడుదల వాయిదా పడుతున్నాయి’’ అని చెప్పింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో చూసిన వారంతా అర్చన చెప్పింది నిజమని అంటున్నారు. దీపికాలాగా ఉంటే.. చాలా ఇబ్బందులు వస్తాయని అంతా అభిప్రాయపడుతున్నారు.

Next Story